: ప్రధాని ఫోటో వాడుకున్నందుకు... క్షమాపణలు చెప్పిన జియో, పేటీఎం


అనుమ‌తి లేకుండా తమ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫొటో వాడిన రిలయన్స్ జియో, పేటీఎంలు ఈ రోజు కేంద్ర స‌ర్కారుకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాయి. ప్రధాని ఫొటోను వ్యాపార స్వలాభానికి వాడుకున్న ఆ రెండు సంస్థ‌ల‌కు ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. మోదీ ఫొటోను వాణిజ్య స్వ‌లాభానికి ఆ రెండు సంస్థ‌లు వాడుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఆ నోటీసుల్లో పేర్కొంది. స‌ద‌రు సంస్థ‌ల‌కు భారీగా ఫైన్ వేయ‌నున్న‌ట్లు వార్త‌లు ఇచ్చాయి. దీంతో స్పందించిన జియో, పేటీఎం సంస్థల ప్ర‌తినిధులు క్ష‌మాప‌ణలు కోరారు.

  • Loading...

More Telugu News