: ‘చేనేత’కు వ్యక్తిగతంగా ఆర్డర్లు తీసుకువస్తా: దుబ్బాకలో సమంత
తెలంగాణ రాష్ట్ర చేనేత అంబాసిడర్, సినీ నటి సమంత సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను, మర మగ్గాలను, మిషన్లను ఆమె పరిశీలించారు. మార్కెటింగ్, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, తాను అధికారికంగా రాలేదని, మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడతానని చెప్పారు. చేనేతకు వ్యక్తిగతంగా ఆర్డర్లు తీసుకు వస్తానని ఆమె హామీ ఇచ్చారు. శాంపిల్స్ నిమిత్తం కార్మికులు ఇచ్చిన చేతి రుమాలు, లెనిన్ వస్త్రాలను సమంత తన వెంట తీసుకువెళ్లారు.