: కేరళ పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్‌ రాజీనామా


అనారోగ్య కారణంతో కేరళ పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్‌ రాజీనామా చేశారు. గతవారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వెళ్లిన ఆయ‌న ప్ర‌మాదానికి గురి కావ‌డంతో ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఢిల్లీలోని 10 జనపథ్‌ కు సన్నిహితంగా మెలిగే ఆయ‌న‌ రాజీనామా చేయ‌డం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి గ‌ట్టి ఎదురుదెబ్బే. 2014లో ఆయ‌న ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడ‌య్యారు. అయితే, ఆ స‌మ‌యంలో ఆయ‌నను కేర‌ళ‌ పీసీసీ అధ్యక్షుడిగా నియ‌మించ‌డం ప‌ట్ల అప్పటి ముఖ్య‌మంత్రి ఓమెన్ చాందీ, అప్పటి రాష్ట్ర‌ పీసీసీ అధ్యక్షుడు రమేశ్‌ చెన్నితల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ పలుసార్లు కేరళ అసెంబ్లీకి, పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.

  • Loading...

More Telugu News