: పద్మవిభూషణ్ పురస్కారానికి ధీరూభాయ్ అంబానీ పూర్తిగా అర్హుడే: సుప్రీంకోర్టు


పద్మవిభూషన్ పురస్కారానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పూర్తిగా అర్హుడేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణానంతరం ధీరూభాయ్ కు గత ఏడాది ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషన్ ను ధీరూభాయ్ తరపున ఆయన సతీమణి కోకిలాబెన్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఆమె వెంట ఉన్నారు.

అయితే, ధీరూభాయ్ అంబానీ ఎలాంటి అసాధారణమైన, ప్రత్యేకమైన సేవలను అందించలేదని... అందువల్ల అతనికి ఇచ్చిన పద్మ పురస్కారాన్ని రద్దు చేయాలని కోరుతూ పీసీ శ్రీవాస్తవ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు... ధీరూభాయ్ అంబానీ బతికున్న రోజుల్లో దేశంలో అతి పెద్ద పారిశ్రామికవేత్తగా వెలుగొందారని తెలిపింది. పద్మవిభూషణ్ పురస్కారం ఎవరికి ఇవ్వాలో చెప్పే అధికారం మీకు లేదని చెప్పింది. ఒకవేళ అదే పురస్కారం మీకు వచ్చినా... మేము దాన్ని ప్రశ్నించమంటూ తెలిపింది.

  • Loading...

More Telugu News