: సుప్రీంకోర్టు సుప్రీమేమీ కాదు: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్ట్ జడ్జి భార్య ఒకరు పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి సీఎస్ కర్ణన్‌పై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో విచారణకు హాజరుకానందుకు సుప్రీంకోర్టు తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో సీఎస్ కర్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, సుప్రీంకోర్టు సుప్రీమేమీ కాదని అన్నారు.
తాను దళితుడిని అయినందుకే తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. కొందరు తనపై కుట్ర పన్నుతున్నారని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు పనికిరాని వాళ్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను 8 ఏళ్ల క్రితం అవినీతి న్యాయమూర్తులపై ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే, ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని చెప్పారు. అవినీతికి పాల్పడ్డ జడ్జిలపై చర్యలు తీసుకోవాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశానని చెప్పారు.