: బీహార్ గుర్తు లేదా? అదే రిపీటవుద్ది: రాహుల్ గాంధీ


రేపు వెల్లడి కానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సమాజ్ వాదీ - కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించనుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నేడు న్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన, "మా కూటమి విజయం సాగించబోతోంది. మీకు బీహార్ ఎన్నికల తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చాయన్నది గుర్తు లేదా? మేం రేపు మాట్లాడతాం" అని ఆయన అన్నారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలన్నీ రాహుల్ తీసుకున్నారన్న సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల తరువాత, బీజేపీ అధికారంలోకి రానుందని సర్వేలు ముక్తకంఠంతో చెప్పగా, అనూహ్య రీతిలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News