: లోకేష్ నుంచి కింద స్థాయి వరకు అందరిదీ ఒకటే చరిత్ర: భూమన
తెలుగుదేశం పార్టీలో బ్యాంకులను లూటీ చేసేవారి సంఖ్య పెరిగిపోతోందని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గజదొంగల పార్టీగా టీడీపీ మారిందని తీవ్ర విమర్శలు చేశారు. బ్యాంకులకు టోకరా ఇచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు వంటివారు టీడీపీలో చాలా మంది ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ నుంచి కింది స్థాయి వరకు అందరిదీ ఒకటే నేర చరిత్ర అని దుయ్యబట్టారు. ఒకవైపు టీడీపీ నేతలంతా విపరీతమైన అవినీతికి పాల్పడుతుంటే... మరోవైపు చంద్రబాబు మాత్రం నీతులు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, భూమన పైవ్యాఖ్యలు చేశారు.