: ఫేక్ అలార‌మ్ కారణంగా క్రికెట్ మ్యాచ్ ఆపేసి స్టేడియం ఖాళీ చేయించిన సిబ్బంది!


దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ క్రికెట్‌ టీమ్‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ ఆట ఫేక్ అలార‌మ్ కార‌ణంగా కాసేపు వాయిదా ప‌డాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో త‌మ ముందు ద‌క్షిణాఫ్రికా ఉంచిన‌ 308 పరుగుల ల‌క్ష్యంలో పైచేయి సాధించే క్ర‌మంలో న్యూజిలాండ్ ఆట‌గాళ్లు దీటుగా ఆడి 341 పరుగులు చేశారు. ఆట కొన‌సాగుతుండ‌గా అదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఫైర్ అలారం మోగింది.

దీంతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను గ్రౌండ్ సిబ్బంది వెంట‌నే స్టేడియం నుంచి బయటకు పంపించారు. మ్యాచ్ బాధ్యతలను చూస్తున్న అధికారులు కూడా బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. రెండు ఫైరింజన్లు కూడా స్టేడియం వద్దకు చేరుకున్నాయి. అయితే, స్టేడియం పరిస‌రాల్లో ఎక్కడా మంటలు కనిపించలేదు. మైదానాన్ని పూర్తిగా ప‌రిశీలించిన సిబ్బంది అది ఫేక్ ఫైర్ అలారం అని స్ప‌ష్టం చేశారు. అనంత‌రం ఆట మళ్లీ మొదలైంది.

  • Loading...

More Telugu News