: కోర్టు ముందుకు కూచిభొట్ల హంతకుడు... ఎంత మాత్రం పశ్చాత్తాపం చూపని ఆడమ్ ప్యూరింటన్!


కేన్సాస్ లోని ఓ బార్ లో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్ ను దారుణంగా కాల్చి చంపిన శ్వేత జాతీయుడు ఆడమ్ ప్యూరింటన్ ను పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన సమయంలో, తాను చేసిన పనికి ఎంతమాత్రమూ పశ్చాత్తాప పడుతున్నట్టు ఆడమ్ కనిపించక పోవడం గమనార్హం. నిబ్బరంతో కనిపించిన ఆడమ్ ను కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయవాది, ఆపై అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల పరిశీలనకు మరింత సమయం కావాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. దీంతో కేసును తదుపరి విచారణ నిమిత్తం వాయదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.

  • Loading...

More Telugu News