: ఘోర రోడ్డు ప్రమాదం... బస్సు లోయలో పడి 26 మంది దుర్మరణం


నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజధాని ఖాట్మండుకు 400 కిలోమీటర్ల దూరంలో, హిమాలయ పర్వతాల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి, లోయలోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 26 మంది మరణించగా, మరో 36 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బస్సు లోయలో సుమారు 200 మీటర్ల దిగువకు దొర్లుతూ వెళ్లి నదిలో పడిందని తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సహాయక చర్యలు చేపట్టామని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్లలో తరలించామని తెలిపారు. ఇంకా కొందరిని తరలించాల్సి వుందని, వాతావరణం అనుకూలించని కారణంగా, సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News