: ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్!: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్


ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరిట నిర్వహించిన సర్వేలన్నీ బోగస్ అని ఆయన తేల్చిచెప్పారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాము విశ్వసించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించిందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్-రాహుల్ జోడీకి అద్భుతమైన ఆదరణ లభించిందని ఆయన తెలిపారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీకి ఆదరణ లభించినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News