: మలయాళ సినీ నిర్మాతతో నటి భావన నిశ్చితార్థం
ప్రముఖ మలయాళ నటి భావన నిశ్చితార్థం సినీ నిర్మాత నవీన్ తో ఈ రోజు జరిగింది. ఈ విషయాన్ని ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోయే ఈ జంటకు తన శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం వాళ్లిద్దరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని, వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. కాగా, నవీన్, భావన కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తెలుగులో ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి చిత్రాల్లో భావన నటించింది.