: మలయాళ నటి భావన వేధింపుల కేసులో కీలక సాక్ష్యం!
మలయాళ నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో కీలక సాక్ష్యం లభించినట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న నటి భావనను వేధిస్తుండగా మొబైల్ లో తీసిన ఓ వీడియో బయట పడిందని తెలిపారు. ఈ సంఘటన వెనుక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే, తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో, సీబీఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని, తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు.