: సిగిరెట్ తాగడం కన్నా ‘సాక్షి’ టీవీ చూడటం చాలా హానికరం: నారా లోకేశ్
‘సాక్షి’ పేపర్, ఛానెల్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, సిగిరెట్ తాగడం కన్నా సాక్షి టీవీ చూడటం చాలా హానికరమని వ్యాఖ్యానించారు. ఒకవేళ, మనం సాక్షి పేపర్ కనుక చదివితే, ‘మెంటల్ బ్యాలెన్స్’ కోల్పోతామని, ఆ పత్రిక అవాస్తవాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని లోకేశ్ మండిపడ్డారు. అవాస్తవాలను అదే పనిగా ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ, వాటిని వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తోందని తూర్పారబట్టారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాను, కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీనని అన్నారు. ‘అందుకే, ప్రజలందరినీ కోరుతున్నాను. దయచేసి, ఆ ఛానెల్ చూడొద్దు.. ఆ పేపర్ చదవద్దు. ఎందుకంటే, ఆ ఛానెల్ లో, పత్రికలో వచ్చే పచ్చి అబద్ధాలు చూస్తే, మన మైండ్ బ్లాక్ అవుతుంది' అన్నారు లోకేశ్.