: రెండో పెళ్లిపై రేణుదేశాయ్ స్పందన!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో విడిపోయాక రేణుదేశాయ్ ఒంటరిగానే జీవిస్తోంది. పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ... ఆమె మాత్రం మరో వివాహం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వాస్తవానికి, రెండో పెళ్లి గురించి చాలా కన్ఫ్యూజన్ కు గురయ్యానని... దీని గురించి ఓ కౌన్సిలర్ వద్దకు కూడా వెళ్లానని చెప్పింది. ఆమెకు తనలో ఉన్న భావాలన్నింటినీ చెప్పానని... దీంతో, మరో పెళ్లి చేసుకోవచ్చు కదా? అని ఆమె చెప్పారని తెలిపింది. అయినా పవన్ తో తాను విడిపోయినా, అతనిపై తనకు ప్రేమ ఉందని చెప్పింది.
ఒక వేళ రెండో పెళ్లి చేసుకున్నా తనకు తోడు మాత్రమే లభిస్తుందని... తన ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేనని రేణు తెలిపింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి తన పిల్లలకు సవతి తండ్రి అవుతాడే తప్ప తండ్రి కాలేడు కదా? అని చెప్పింది. రెండో పెళ్లిలో కచ్చితంగా ప్రేమ ఉండదని తేల్చి చెప్పింది.
రెండో పెళ్లి దిశగా తనకు కూడా ఆలోచనలు వస్తుంటాయని, కానీ, కొన్ని భయాలు వెంటాడుతుంటాయని తెలిపింది. రెండో పెళ్లి తర్వాత కూడా మళ్లీ తొలిసారి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయేమోననే భయం వెంటాడుతుందని చెప్పింది. మళ్లీ ప్రేమలో పడతానో లేదో కూడా తెలియదని చెప్పింది. సరైన వ్యక్తి దొరికితే తన రెండో పెళ్లి విషయం స్వయంగా చెబుతానని తెలిపింది.