: పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ దారుణ హత్య!


పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ దారుణ హత్యకు గురైంది. బలుచిస్థాన్ ప్రావిన్స్ లోని నసీరాబాద్ జిల్లాకు చెందిన జనియా కుమారి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో ఆమెను దారుణంగా నరికి పరారయ్యారు. ఈ సంఘటనపై జనియా కుమారి సోదరుడు జలోరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే తన సోదరిని హతమార్చి ఉంటారని జలోరామ్ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీసులకు విన్నవించారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News