: 11 సిక్సర్లు, 6 ఫోర్లతో వేగవంతమైన సెంచరీ చేసిన వెస్టిండీస్ ఆటగాడు స్మిత్


టీ20 ధాటికి రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ రికార్డు నెలకొల్పాడు. ఒక్క బంతి తేడాతో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు మిస్సయ్యాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడిన క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ బాదేసి అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని రికార్డును స్మిత్ ఒక్కబంతి తేడాతో మిస్సయినప్పటికీ...రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. తాజాగా ప్రారంభమైన హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్ లో స్మిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 11 సిక్సర్లు, 6 ఫోర్లతో కేవలం 31 బంతుల్లో సెంచరీ సాధించాడు. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కావ్ లూన్ కాంటాన్స్ తరపున స్మిత్ 40 బంతుల్లో 121 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు సిటీ కతైక్ పై కేవలం 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కావ్ లూన్ కాంటాన్స్ విజయం సాధించింది. 

  • Loading...

More Telugu News