: బ్యాలెట్ పేపర్ పై ఫోటో మారినందుకు తెలంగాణలో రీ ఎలక్షన్... కాసేపట్లో వెలువడనున్న కీలక నిర్ణయం!
నేటి ఉదయం నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారైనందున తిరిగి ఎన్నిక జరిపించే దిశగా ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న ఈసీ ప్రస్తుతం తప్పెక్కడ జరిగిందన్న విషయమై విచారిస్తోంది. మరోవైపు పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ, గతంలో యూపీలో ఇదే విధంగా ఫోటోలు మారిన సమయంలో ఎన్నికల కమిషన్, ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించింది. ఇప్పుడు కూడా అదే విధమైన నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోటోలు మారడం వల్ల అభ్యర్థుల గెలుపు ఓటములు కచ్చితంగా ప్రభావితం అవుతాయన్న అంచనా ఉన్నందున రీ పోలింగ్ తప్పదని తెలుస్తోంది. కాగా, ఈ విషయంలో నేషనల్ ఈసీ మధ్యాహ్నం 2:30కి తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు.