: 'పేటీఎం' బాదుడు మొదలైంది!


వినియోగదారుల నడ్డి విరిచేందుకు నగదు చెల్లింపుల మాధ్యమ సంస్థ పేటీఎం సిద్ధమైంది. క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎం వ్యాలెట్ లోకి నగదు ట్రాన్స్ ఫర్ చేసుకునే వారికి 2 శాతం ఛార్జ్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని కోరింది. పేటీఎంలోకి ఉచితంగా నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో... అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారని పేటీఎం యాజమాన్యం తెలిపింది. దీన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అయితే, ఈ విషయంపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... తాము విధించిన ఛార్జీ తిరిగి కూపన్స్ రూపంలో వినియోగదారుడికి చేరుతుందని చెప్పింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల ద్వారా పేటీఎం వ్యాలెట్ రీచార్జ్ చేసుకునే వారికి ఈ ఛార్జీలు వర్తించవని తెలిపింది. కొందరు వినియోగదారులు క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎం వ్యాలెట్ లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసి, ఆ తర్వాత తిరిగి ఇతర బ్యాంకుల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారని చెప్పింది.

  • Loading...

More Telugu News