: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా!


ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ భారీ షాక్ ఇచ్చింది. వైజాగ్ కు సమీపంలో ఉన్న దువ్వాడ ఫార్ములేషన్ల ప్లాంటులో తనిఖీలు నిర్మహించిన అమెరికా సంస్థ 13 అబ్జర్వేషన్లతో కూడిన ఫామ్ 483ని జారీ చేసింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఫైలింగ్ లో డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. దిద్దుబాటు చర్యలను చేపట్టామని ఫైలింగ్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మార్కెట్లో భారీ నష్టాలకు గురవుతున్నాయి. దాదాపు 52 వారాల కనిష్టానికి ఈ కంపెనీ షేర్లు పడిపోయాయి.  

  • Loading...

More Telugu News