: అక్కడ ఏది కొన్నా పదిరూపాయలే... సామాన్యుల క్యూ!
ఆ షాపులో ఏ వస్తువు కొనుగోలు చేసినా కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. నిరుపేదలందరికీ తక్కువ ధరలో అన్ని వస్తువులను అందించాలనే లక్ష్యంతో 'ఏక్ నూర్' అనే స్వచ్ఛంధ సంస్థ ఈ షాపును పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో ఏర్పాటు చేసింది. కేవలం 10 రూపాయలకే ఈ షాపులో దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యావసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఏక్ నూర్ స్వచ్ఛంధ సంస్థ ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత భేదాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని సంస్థ సభ్యులు తెలిపారు.