: ఆసుపత్రిలో సంతకాలు చేసిన ఆ బంధువులెవరో ప్రకటించాలి: జయ మేనకోడలు డిమాండ్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమకు అనుమానాలున్నాయని... ఈ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని జయ మేనకోడలు దీప డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయకు ఎక్మో వంటి చికిత్సలు అందించేందుకు ఆమె బంధువుల సంతకాలు తీసుకున్నామంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దీప కొన్ని అనుమానాలను వ్యక్తపరిచారు. జయలలితకు రక్త సంబంధీకులుగా తాను, తన సోదరుడు దీపక్‌ మాత్రమే వున్నామని, తామిద్దరం ఆసుపత్రి పత్రాల్లో ఎలాంటి సంతకాలు చేయలేదని వివరించారు. సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇలాంటి వివరణతో అత్తయ్య మరణం పట్ల తమకు మరిన్ని సందేహాలు కలుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News