: 'ఉమెన్స్ డే' నాడూ జంటలను పరుగెత్తించి కొట్టిన శివసేన!


'ఆ దినం, ఈ దినం' అంటూ, పాశ్చాత్య సంస్కృతిని తీసుకువచ్చి, భారత్ ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, శివసేన కార్యకర్తలు మహిళాదినోత్సవం నాడు తమకు కనిపించిన జంటలపై దాడికి దిగారు. పార్కుల్లో, బీచ్ ల వద్ద సేదదీరుతూ కబుర్లు చెప్పుకుంటున్న వారిని పరుగెత్తించారు. చేతుల్లో లాఠీలు, కర్రలు, శివసేన జండాలు పట్టుకుని రౌడీల్లా ప్రవర్తించారు. మహిళలను సంరక్షించాల్సిన బాధ్యత తమకుందంటూ, వారితో ఉన్న యువకులను తమ వద్ద ఉన్న కర్రలతో వాయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News