: 'వీటో' ఇప్పట్లో వాడం.. ముందు శాశ్వత సభ్యత్వం ఇవ్వండి!: ఐరాస ముందు భారత్ ప్రతిపాదన


ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇస్తే చాలని, వీటో సంస్కరణలు జరిగే వరకూ ఏ విషయంలోనూ తాము 'వీటో' హక్కును వినియోగించుకోబోమని భారత్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత సభ్యుడు సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. క్రియాశీల సంస్కరణలు కొనసాగాలన్నదే తమ అభిమతమని, కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వీటో లేకుండా శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేసిన విజ్ఞప్తికి జీ-4 దేశాల కూటమిలోని మిగతా దేశాలు జపాన్, బ్రెజిల్, జర్మనీ మద్దతిచ్చాయి. తాము కూడా సంస్కరణల్లో మాత్రమే పాల్గొంటామని, వీటో వద్దని ప్రతిపాదించాయి.

కాగా, 1945లో ఏర్పడిన ఐరాసలో ప్రస్తుతం చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, యూఎస్ లు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ఎన్నో దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ఒత్తిడి తెస్తున్నా, నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. దక్షిణాసియాలో కీలక శక్తిగా ఎదుగుతున్న భారత్ ఎన్నో సంవత్సరాలుగా శాశ్వత సభ్యత్వం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీ-4 దేశాల కూటమి చేసి తాజా ప్రతిపాదనకు ఐరాస ఓకే చెప్పవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News