: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోల తారుమారుతో తెలంగాణలో కలకలం!


తెలంగాణలో ఈ ఉదయం నుంచి ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బ్యాలెట్ పేపర్లో పేరు పక్కనే ఫోటోలను కూడా ఉంచగా, ఒక పేరు పక్కన మరొకరి ఫోటో దర్శనమిచ్చింది. దీంతో ఓటర్లు పోలింగ్ ఏజంట్లకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో మాణిక్ రెడ్డి పేరు దగ్గర లక్ష్మయ్య ఫోటో వచ్చింది. దీంతో ఎవరికి ఓటు వేయాలో తెలియడం లేదని ఓటర్లు వాపోయారు. జరిగిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళతామని, వారు తీసుకునే నిర్ణయం ఆధారంగా పనిచేస్తామని రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News