: రోజా క్షమాపణలు చెప్పాలి: కారెం శివాజీ డిమాండ్
చిత్తూరు నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత పట్ల అసెంబ్లీలో అనుచిత వాఖ్యలు చేసిన రోజా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రోజా క్షమాపణలు చెప్పని పక్షంలో చిత్తూరులో ఆమె ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆమె అనితకు క్షమాపణలు చెప్పేంతవరకు ఆమెను అమరావతిలోని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. అప్పటికీ ఆమె దిగిరాని పక్షంలో దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని, ఆ సందర్భంగా స్పీకర్ కు వినతిపత్రాలు ఇస్తామని ఆయన కార్యాచరణ తెలిపారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన రోజాను వైఎస్సార్సీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.