: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు ‘బ్లాక్’ లో వాటర్ లీక్!
వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో లీకేజ్ లు బయటపడుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు విధులు నిర్వర్తించే బ్లాక్ లోనే వాటర్ లీక్ అయింది. వాటర్ ట్యాంక్ నుంచి నీరు కారడం వల్ల ఈ విధంగా జరిగిందని సమాచారం. వెంటనే, రంగంలోకి దిగిన సిబ్బంది సంబంధిత కార్మికులను ఆదేశించడంతో ఆ బ్లాక్ ను శుభ్రం చేశారు.