: నెల్లూరులో టీడీపీ మహిళా నేతల మధ్య విభేదాలు!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా విభాగం నేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి. మహిళా దినోత్సవ వేడుకలను తాము లేకుండా నిర్వహించారంటూ బీసీ మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మంత్రి నారాయణ కేక్ కట్ చేశారు. అయితే, నారాయణ కేక్ కట్ చేసి వెళ్లిన సమాచారం తెలుసుకున్న బీసీ మహిళా సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అక్కడ ఉన్న మహిళా నేతలతో వాదనకు దిగారు. తమను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News