: నేను చేసిన తొలి తప్పు అదే...తలచుకుంటే అలా చేయకుండా ఉండాల్సిందనిపిస్తుంది: బాలీవుడ్ భామ జాక్వెలిన్


14 ఏళ్ల వయసులో ఉండగా చేసిన చిన్న పొరపాటును తలచుకుంటే హాస్యాస్పదమనిపిస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పుడప్పుడు చేసే చిన్న పొరపాట్లు అలా చేసి ఉండాల్సింది కాదనిపిస్తుందని తెలిపింది. 14 ఏళ్ల వయసులో ఉండగా తన బాయ్ ఫ్రెండ్ కు లిప్ లాక్ ఇచ్చానని చెప్పింది. అప్పుడు తెలిసీ తెలియని వయసులో అలా చేశానని చెప్పింది. ఇప్పుడది తల్చుకుంటే హాస్యాస్పందగాను, అలా చేసి ఉండాల్సింది కాదని అనిపిస్తుందని చెప్పింది. ఆ తరువాత అతనితో బ్రేకప్ అయిందని జాక్వెలిన్ తెలిపింది. తెలిసీ తెలియని వయసులో అలాంటి తప్పులు చేయకూడదని జాక్వెలిన్ అభిప్రాయపడింది. 

  • Loading...

More Telugu News