: మహిళా దినోత్సవం అన్నదే అనవసరం: మంచు లక్ష్మి


ఏడాదిలో ఏదో ఒక రోజు మహిళల్ని గౌరవిస్తే సరిపోదని .. ప్రతి రోజూ మహిళలను గౌరవించాలని .. అసలు, మహిళా దినోత్సవం అనేదే అనవసరమైన ఆలోచన అని ప్రముఖ నటి మంచు లక్ష్మి పేర్కొంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళలను ఎలా గౌరవించాలనే విషయాన్ని తల్లులే తమ బిడ్డలకు నేర్పించాలని సూచించింది. మహిళలతో పాటు పురుషులు కూడా కష్టపడుతున్నారని, కుటుంబ అవసరాల నిమిత్తం పగలూరాత్రీ అనే తేడా లేకుండా వారు కష్టపడుతున్నారని, అలా అని చెప్పి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడింది. సమాజంలో ఆడ, మగ అనే వివక్ష చూపడం తనకు నచ్చదని .. ఉమెన్స్ డే జరుపుకోవడం అనవసరమని చెప్పిన ఆమె, పురుషుల దినోత్సవం కూడా నిర్వహిస్తే బాగుంటుందంటూ తనదైన శైలిలో చమత్కరించింది.

  • Loading...

More Telugu News