: గాయని సుచిత్ర పెడుతున్న ఆ ప్రైవేట్ ఫొటోలన్నీ ఫేక్: హీరో ఆర్య
పలువురు హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కలకలం రేపుతున్న గాయని సుచిత్ర తీరుపై నటుడు ఆర్య స్పందించాడు. ఆమె లీక్ చేసే ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని ఆయన ఆరోపించాడు. వాటిని ప్రజలు నమ్మకూడదని చెప్పాడు. ఆమె ఇలాంటి చవకబారు ప్రచారం చేసి బెదిరిస్తోందని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఇకపై ఆమె మరిన్ని ఫేక్ వీడియోలను కూడా విడుదల చేయొచ్చని అన్నాడు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు రావడం ఎంతో సాధారణమేనని అన్నాడు. వాటికి సినీనటుల పేర్లు జోడిస్తే వైరల్‌గా మారుతాయని పేర్కొన్నాడు. ప్రజలు వాటిని చూస్తూ ప్రోత్సహించకూడదని అన్నాడు. సుచిత్ర సోషల్ మీడియాలో పెడుతున్నవన్నీ నకిలీవని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నాడు.