: ఖైరతాబాద్ ఆర్టీఏలో మహిళలకు ప్రత్యేక లైసెన్స్ మేళా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ ఆర్టీఏలో మహిళా లైసెన్స్ ల మేళా నిర్వహించినట్లు ఆర్టీవో ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించామని, పలువురు మహిళలు ఈ మేళాలో పాల్గొని లైసెన్స్ లు పొందారని చెప్పారు. ఈ సందర్భంగా మేళాకు హాజరైన మహిళలు మాట్లాడుతూ, మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరుతూ, లైసెన్స్ ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.