: ఈ ఫొటోలో మహిళలు నా జీవితానికి పాజిటివ్ ఫోర్స్: హీరో రామ్ చరణ్
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ప్రత్యేకమైన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో రామ్ చరణ్ తల్లి సురేఖ, సోదరీమణులు సుస్మిత, శ్రీజ, భార్య ఉపాసన, నాగబాబు కూతురు, ప్రముఖ నటి నీహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహలతతో పాటు ‘మెగా’ కుటుంబానికి చెందిన ఇతర మహిళలు ఈ ఫొటోలో ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న మహిళలు తన జీవితానికి పాజిటివ్ ఫోర్స్ అని, హ్యాపీ ఉమెన్స్ డే అని ఆ పోస్ట్ లో రామ్ చరణ్ పేర్కొన్నాడు.