: ఇప్పట్లో రాలేము: గవర్నర్ కు తేల్చి చెప్పిన ఏపీ, టీఎస్ మంత్రులు
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు గవర్నర్ నరసింహన్ సమక్షంలో రేపు జరగాల్సిన తెలంగాణ, ఏపీ మంత్రుల స్థాయి సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం వాయిదా పడ్డట్టు గవర్నర్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు, మరో వారంలో బడ్జెట్ రానున్న దృష్ట్యా, తాము రాలేమని ఇరు రాష్ట్రాల మంత్రుల నుంచి అధికారిక సమాచారం అందిందని, అందువల్ల కమిటీ భేటీ వాయిదా పడిందని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై తదుపరి నిర్ణయం గవర్నర్ తీసుకుంటారని ఓ అధికారి వెల్లడించారు.