: మెట్రో రైలు పూర్తి కావడానికి ఇంకెన్ని రోజులు కావాలయ్యా?: 'హైదరాబాద్ జిందాబాద్' సంస్థ


హైదరాబాదులోని మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయాలని, ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ 'హైదరాబాద్ జిందాబాద్' సంస్థ సంతకాల సేకరణను చేపట్టింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించింది. హైదరాబాదులోని ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టంను అభివృద్ధి చేయడమొక్కటే పరిష్కారమని ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ సంస్థ తెలిపింది. మెట్రో రైలుకు సంబంధించి ఇప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని విమర్శించింది. పనులు పూర్తయిన రూట్లలో రైలు సర్వీసులను ప్రారంభించాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News