: డిగ్రీ ప‌ట్టా అందుకోనున్న‌ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్


ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ హార్వర్డ్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. డిగ్రీ రెండవ సంవ‌త్స‌రంలో ఉండ‌గానే ఫేస్ బుక్ ను స్థాపించిన మార్క్ జుకర్ బర్గ్ అనంత‌రం త‌న చ‌దువుని కొన‌సాగించ‌లేదు. 2004లోనే హార్వర్డ్ స్కూల్ కి గుడ్ బై చెప్పేశారు. హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్ గానే మిగిలిపోయారు. అయితే, హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని నిర్ణ‌యించింది. ఈ ఏడాది మే నెలలో జరుగనున్న‌ హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సెర్మినీలో ప్ర‌సంగించ‌నున్న‌ అతిపిన్న వయస్కుడిగా కూడా ఆయ‌న పేరుతెచ్చుకోనున్నారు. అదే రోజు ఆయ‌నకు ఆ ప‌ట్టాను అందించాల‌ని ఆ వ‌ర్సిటీ నిర్ణయం తీసుకుంది. ప్ర‌పంచంలో అత్యంత ఆద‌ర‌ణ సంపాదించుకున్న ఫేస్‌బుక్‌కు సుమారు 2 బిలియన్ ఖాతాదారులున్నారు.

  • Loading...

More Telugu News