: మహిళా దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ట్వీట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మహిళలంటే ఎనలేని గౌరవం. మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. మహిళాదినోత్సవం సందర్భంగా తన తల్లి ఇందిర, కుమార్తె సితారల ఫొటోలను మహేష్ ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు, "బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రెస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ" అంటూ కామెంట్ పెట్టాడు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు కూడా మహేష్ తన కుమార్తె ఫోటోను పోస్ట్ చేశాడు. తన కుమార్తె తనకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటూ ట్వీట్ చేశాడు. తన గౌరవం, తన సంతోషం అంతా తన కుమార్తే నంటూ వ్యాఖ్యానించాడు. కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులంతా గర్వంగా ఫీల్ కావాలని అన్నాడు.
#InternationalWomensDay pic.twitter.com/zswCIIKlgK
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2017