: సీన్ రిపీట్ అవుతోంది.. శశికళకు జైల్లో పాదాభివందనం చేస్తున్న నేతలు


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర,  వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు వీరు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారు. అనంతరం, వీరంతా దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. గతంలో పార్టీ శ్రేణులంతా జయలలితకు పాదాభివందనం చేసేవారు. పాదాభివందనం చేస్తున్న ఏ ఒక్కరినీ కూడా ఆమె వారించేవారు కాదు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. అమ్మ స్థానంలో చిన్నమ్మకు కూడా పాదాభివందనాలు మొదలయ్యాయి. 

  • Loading...

More Telugu News