: గాలి మైనింగ్ కేసులో హైదరాబాదులో సోదాలు.. పలువురు అధికారులకు నోటీసులు


ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాదులో సోదాలు నిర్వహించారు. నగరంలోని హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, బషీర్ బాగ్ లలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్బంగా పలువురు ప్రభుత్వాధికారులతో పాటు మరి కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పై బైట ఉన్న సంగతి తెలిసిందే. బళ్లారికి వెళ్లకూడదంటూ కోర్టు ఆయనకు షరతు విధించడంతో... ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News