: మరిన్ని రోజులు ఉత్కంఠ... మారిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తేదీ


ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వెల్లడికి అభ్యర్థులు మరిన్ని రోజుల పాటు ఉత్కంఠతో వేచి ఉండక తప్పదు. తొలుత కౌంటింగ్ ను 15వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్, ఆపై ఈ తేదీని 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మూడు రోజుల క్రితమే ఈ ఆదేశాలు అందగా, జిల్లా స్థాయి అధికారులు ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కౌంటింగ్ తేదీని మార్చినట్టు అనంతపురం కలెక్టర్ శశిధర్ మీడియాకు వివరించడంతోనే ఈ విషయం తెలిసింది.

  • Loading...

More Telugu News