: హైకోర్టులో అప్పీల్ చేస్తాం : సాయిబాబా భార్య వసంత
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు యావజ్జీవ శిక్ష విధిస్తూ గడ్చిరోలి కోర్టు ఈ రోజు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో సాయిబాబా భార్య వసంత మాట్లాడుతూ, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేస్తామని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ శిక్ష పడటం తనను షాక్ కు గురి చేసిందని, న్యాయవ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చినట్టు కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, 2014 లో ఢిల్లీలోని తన నివాసంలో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం, ఈ తీర్పు నిచ్చింది.