: హోటల్ లో టీమిండియా సంబరాలు!


భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన రెండో టెస్టులో 75 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులు బస చేసిన హోటల్ సిబ్బంది క్రికెటర్లకు కరతాళ ధ్వనులతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అనంతరం, ‘కంగ్రాట్యులేషన్స్ టీమిండియా’ అని రాసి ఉన్న రెండు కేక్ లను హోటల్ సిబ్బంది తయారు చేసింది. ఆ కేక్ లను కోహ్లీ సేన కట్ చేసి తమ ఆనందాన్ని హోటల్ సిబ్బందితో పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

  • Loading...

More Telugu News