: ఎన్నికల ఖర్చు వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏపీ స్పీకర్ కోడెలపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదు
కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 20వ తేదీన కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని కోడెలకు సమన్లు జారీ చేశారు. కాగా, 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావడానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం కేస నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ కోడెలపై కేసు నమోదు చేశారు.