: సాయంత్రం 6 గంటలకల్లా ప్రచారం నిలివేయాలి: భన్వర్ లాల్


ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్‌ తెలిపారు. శాసనమండలి గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి నిలిపి వేయాలని సోమవారం నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్‌లో  కలెక్టర్లకు  ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి లిక్కర్‌షాపులు మూయించివేయాలన్నారు. ఈ నెల 9న జరగనున్న పోలింగ్‌ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా సెలవులు మంజూరు చేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ప్రచురణకు సంంధించిన వివరాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల సిబ్బందితో సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.  

కడప జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 78,168 పట్టభద్రుల ఓటర్లు ఉండగా, ఇప్పటికి 47 వేల స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. అలాగే 5970 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా, 3600 స్లిప్పులు పంపిణీ చేశామని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సులు ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి సరఫరా చేసే మెటీరియల్‌ కిట్స్‌ను తయారు చేశామన్నారు. పది పోలింగ్‌ కేంద్రాల మార్పు కోసం ఎన్నికల కమిషన్‌ను కోరగా, తొమ్మిదింటికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాల జాబితాను రూపొందించామని తెలిపారు. సమావేశంలో జేసీ శ్వేత తెవతీయ, జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్వో నరసింహారావు, ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, వీరబ్రహ్మయ్య, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News