: గతేడాది భార్యకు విడాకులిచ్చాడు...ఇప్పుడు 'బాయ్ ఫ్రెండ్'ని పెళ్లి చేసుకుంటున్నాడు!
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఏ విషయమైనా విశేషమే. తాజాగా బ్రిటన్ రాజకుటుంబానికి వంటమనిషిగా పనిచేసిన పాల్ బురెల్ కు సంబంధించిన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. వేల్స్ యువరాణి ప్రిన్సెస్ డయానా వద్ద పాల్ బురెల్ వంటమనిషిగా పని చేశాడు. ఏడాది క్రితం పాల్ (58) తన భార్య మరియా (32) కు విడాకులిచ్చాడు. ఇద్దరు పిల్లలు కలిగిన ఈ దంపతులు సుదీర్ఘకాలంగా వీరు వేరుగా ఉంటుండడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
దీంతో బురెల్ ఇప్పుడు తన ప్రియుడు, న్యాయవాది అయిన గ్రహం కూపర్ ను వచ్చే నెల వివాహం చేసుకోనుండడం పెద్ద వార్తయింది. ప్రిన్సెస్ డయానా వద్ద వంటమనిషిగా పని చేసే సమయంలో ఓ టీవీ షోలో పాల్గొని పాప్యులర్ అయిన పాల్, రాజకుటుంబం విషయాలతో కూడిన ఆత్మకథను కూడా రాశాడు.