: 25 సార్లు అశ్విన్ ఆ ఘనత సాధించాడు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లు తీసి రాణించిన రవిచంద్రన్ అశ్విన్ ఆకట్టుకున్నాడు. అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అశ్విన్ కు లక్ష రూపాయల నగదుతోపాటు మెమెంటో ను నిర్వాహకులు అందజేశారు. ఈ మ్యాచ్ లోని రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ వేగంగా 5 వికెట్లు సాధించిన ఆటగాళ్లలో టాప్ లో నిలిచాడు. 41 పరుగులిచ్చిన అశ్విన్ 6 వికెట్లు తీశాడు. దీంతో తక్కువ పరుగులిచ్చి 5 వికెట్ల ఘనత సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు. అలాగే 25 సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.