: 75 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎన్నో మలుపులు తిరిగిన రెండో టెస్టు చిట్టచివరికి భారత్ వైపు మొగ్గుచూపింది. రెండో ఇన్నింగ్స్ అనంతరం భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి సత్తా చాటింది. సిరీస్ లో స్కోరు సమం చేసింది. మ్యాచ్ విజయంలో కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే రాణించగా, తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి జడేజా ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్ లో ఆరువికెట్లు తీసి అశ్విన్ ఆసీస్ నడ్డివిరిచాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉండి కూడా ఓటమిపాలయ్యారు. వార్నర్ (17), రెన్ షా  (5), షాన్ మార్ష్ (9), స్మిత్ (28), మిచెల్ మార్ష్ (13), మాధ్యూ వేడ్ (0), మిచెల్ స్టార్క్ (2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.

మూడవ డౌన్ లో దిగిన హ్యాండ్స్ కోంబ్ (24) తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయాడు. చివర్లో అశ్విన్ ఆన్ సైడ్ నుంచి ఆఫ్ సైడ్ తిరిగేలా సంధించిన బంతిని ఆడబోయిన నాథన్ లియాన్ (2) అశ్విన్ కే క్యాచ్ ఇచ్చి మ్యాచ్ ముగించాడు. హాజిల్ వుడ్ నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత జట్టు 75 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసిరాణించగా, అతనికి ఉమేష్ యాదవ్ రెండు వికెట్లతో, ఇషాంత్, జడేజా చెరొక వికెట్ తీసి సహకరించారు. దీంతో బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో రెండు జట్లు చెరొక విజయంతో సమఉజ్జీలుగా నిలిచాయి. 

  • Loading...

More Telugu News