: ఉమేష్ విసిరిన బంతికి మైదానంలో విలవిల్లాడిన ఆసీస్ బ్యాట్స్ మెన్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హ్యాండ్స్‌కాంబ్ కు బాల్ దెబ్బ తగలడంతో మైదానంలోనే విలవిల్లాడాడు. 19వ ఓవర్లో టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ విసిరిన మొదటి రెండు బాల్స్‌కి పరుగులు తీయలేకపోయిన ఆయన మూడో బాల్‌ని అంచనా వేయలేకపోయాడు. ఉమేష్ విసిరిన బంతి నేరుగా వెళ్లి హ్యాండ్స్‌కాంబ్ పొట్టను తాకింది. దీంతో బాధతో విలవిల్లాడాడు. అనంతరం కూడా మరో మూడు బంతుల్ని ఎదుర్కొన్న హ్యాండ్స్‌కాంబ్ పరుగులేమీ చేయలేకపోయాడు. అంతేకాదు ఆ తరువాతి 20వ ఓవర్లో జడేజా వేసిన బౌలింగ్‌లోనూ ఆసీస్ పరుగులు చేయలేకపోయింది.