: తిరుగుతున్న బంతి... ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా!


సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్ చేయడం క్లిష్టతరంగా మారుతున్న బెంగళూరు పిచ్ పై 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తడబడుతోంది. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేస్తున్నప్పటికీ, ఎవరూ సఫలం కావడం లేదు. ఈ క్రమంలో 25 బంతులాడిన వార్నర్ 17 పరుగులకు అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీ రూపంలో వెనుదిరగగా, 12 బంతులాడిన రెన్షా 5 పరుగులు చేసి ఇషాంత్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై 19 బంతులాడి 9 పరుగులు చేసిన మార్ష్ ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ఈ అవుట్ ను రీప్లేలో చూస్తే, అది అవుట్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం స్మిత్ 28, హ్యాండ్స్ కొంబ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరితో పాటు మార్ష్, వాడేల వికెట్లను తీస్తే, ఆపై టెయిలెండర్లు మిగులుతారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు కాగా, విజయానికి ఇంకా 117 పరుగులు రాబట్టాల్సివుంది.

  • Loading...

More Telugu News