: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ అలక


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి పట్ల డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన చంద్రబాబు... తన కుటుంబానికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో కోరుతున్నా... చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి, తన తమ్ముడికి సమాధానం చెప్పుకోలేక పోతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో రాయలసీమ నుంచి ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని అన్నారు. కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే... ఇక్కడ టీడీపీ గెలుస్తుందని కేఈ చెప్పారు. 

  • Loading...

More Telugu News